Thursday, May 30, 2024

భారతీయ శాస్తవేత్తలు. శీర్షిక : మహానుభావులు అందరికి వందనాలు... 28-07-23

 భారతీయ శాస్తవేత్తలు. 

శీర్షిక : మహానుభావులు అందరికి 
వందనాలు... 

పేరు మారినంత మాత్రాన 
పెన్నిధిగా పొందిన సేవలు 
పేరుకు రాకుండా పోతాయా? 
పెన్నిధులు కాకుండా పోతారా ? 
వింతగ విశ్వం కన్ను తెరవక ముందే 
వినీలాకాశంలో ధ్రువతారాలు మన 
ఋషులు మహాపురుషులు .... 

ఖగోళంలోని కమనీయతలను 
గణితంలోని గుంభ నాలను పసిగట్టిన  
ఆర్యభట్ట ... 
బీజగణితంలో భీష్మఆచార్యుడు 
భాస్కరాచార్య ... 
అటామిక్ థియరీలో అనన్యుడు 
ఆచార్య కనద్ ... 
రసాయన శాస్త్రంలో రసరమ్యుడు 
మన నాగార్జునుడు... 

వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు 
శస్త్ర చికిత్స చకితుడు శుశ్రూతుడు 
ఖగోళంలో దిట్ట వరాహమిహిరుడు 
ఎందరో మహానుభావులు అందరికి 
వందనాలు... 

మొక్కలకు ప్రాణమున్నదన్న 
జగదీశ చంద్రబోసు అయినా ... 
లెక్కల్లో ప్రావీణ్యముతో  సి వి రామనయినా
యోగశాస్త్రంలో ఉద్దండుడు 
పతంజలి అయినా .... 
ఏవియేషన్లో భరద్వాజుడైనను …  
భరతమాత ముద్దుబిడ్డలే...  
ఆధునికతలో మరికొందరు 
అందరూ ఆ తల్లి బిడ్డలే… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment