ఆకాశ వీథిలో టమాట సంచారం
తేది: 07-07-2023
శీర్షిక : సై
పచ్చివైనా సరే పండినా సరే
పచ్చడికైనా సై శాఖానికైనా సై
అంటూ కదనరంగములో కత్తి
దూసే సైనికుడే ఎల్లప్పుడూ ....
రంగు రంగుల టమాటాలు
హంగులన్నీ మూటగట్టుకుని
పొంగులన్నీ ప్రదర్శిస్తూ
నోరూరించే రంజైన టమాటా...
అత్యంత తక్కువ ధరకైనా
అందనంత ప్రియమైన సరే
అదిరిపోయే రుచులకైనాసరే
మాటకు మాట ఆ టమటాకే చెల్లింది …
రాజకీయ వేదికైనా సరే
రాజరికం కట్టబెట్టలేని
రైతు నిరసనలకైనా సరే
గొంతు పెంచితే రంగు పడుద్ది...
గుడ్డివెలుగుల గుడిసెలోనా
రంగురంగుల రాజభవనాలలోనా
నిమిషాలలో ఆతిథ్యానికైపుడూ
తక్షణ తయారీలలో తాను సిద్దం ...
నూనెలో మగ్గించి నున్నగా నూరినా
పచ్చడిగ పదిలమై ముద్దగా నోటికందుతూ..
పప్పులో వేసినా పసందుగా కూరనైపోతా
కాదు కూడదని పొత్తులో దేనితోనైనా సరే…
వేడిచేసి చారుకాచినా పుల్లగా రుచినిస్తా…
సంవత్సరమంతా సందడి చేస్తూనే ఉంటా..
అప్పుడప్పుడు దూరంగా పయనమై
దూరిపోతుంటాను.. చుక్కల్లో చంద్రుడినై
ఆకాశవీథిలో సంచరిస్తుంటాను. …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment