Thursday, May 30, 2024

కవన రవళి. 16-08-23 నానీలు.

 కవన రవళి. 16-08-23 నానీలు. 


 స్వేచ్చా భారతం 
 మొహమాటమే 
మాట్లాడలేక 
సగటు మనిషి. 

 విభజించి ఫలాలు 
పంచిపెడుతుంటే 
 విద్వత్తులన్నీ 
 విరమించుకున్నాయి. 

 చివరి కమతంకు 
చెరువు నీరులా 
సగటు మనిషి 
స్వేచ్చ పొందితేనే. 

 మ్యానిఫెస్టోలతో 
 మతాబు వెలుగులే
అధికారమొస్తే 
 అటకమీదనే… 

ఓటు హక్కు 
 వజ్రాయుధమైతే 
 కీచక రక్తం 
 నేలపై పడిందా?

 నగునూరి రాజన్న 

No comments:

Post a Comment