స్నేహాయానం
తేది : 08-08-2023
శీర్షిక : ప్రాణవాయువు ....
అవసరాలు గుర్తించి
ఆపన్నమయ్యే హస్తం ...
అడగకముందే తెలుసుకుని
అనుగ్రహించే హృదయం ....
గమ్యం మనదైనా
అడుగులు జోడించి
గమన పయనంలో
దన్నుగా నిలిచే మనసు ....
స్వార్ధపు మరక అంటుకోనిది
మననంతోనే మనసు పులకరించి
సౌభ్రాతృత్వం సదా పంచుతూ
వెలుగులు నింపేది ....
అమ్మలాంటి ఆత్మీయతత్వం
నాన్నలాంటి అనురాగం
తోబుట్టువు లాంటి అనుబంధం
ప్రకృతిలా పంచే మనస్తత్వం.....
మాటలతో మొదలైనా
అప్రకటిత రహస్యాలు సైతం
అలవోకగా పంచుకుని
అలుపు తీర్చుకునే తావు .....
ఉరుకుల పరుగుల జీవితాలలో...
మనషి ఊపిరాడక సతమతమైతే ...
ప్రాణవాయివులై పరితపించేది.....
స్నేహయానమే
నగునూరి రాజన్న
No comments:
Post a Comment