హృదయ దర్పణం
తేది : 18-08-2023
శీర్షిక : గుండె లోతులు ....
సహస్రాధికం
పేరేదయినా సరే సందర్భానుసారంగా
వాలుగా వీలుగా వాడుకునే సౌకర్యం ....
గుంపులో గోవిందమే అయినా
మనిషి ఒంటరి మహా తుంటరి సుమా...
కళ్ళు మూసుకుని పిల్లి పాలలా
తాగిన చందమే మానవుని లోని
మాసిపోని మర్కట లక్షణాలు ....
కీర్తిమూటలు ఎన్ని మోసుకొచ్చినా
అధీనత లేని అంతర్గత తప్పొప్పులను
మననం చేస్తూ అడుగడుగున
అనుసరిస్తూ అపసవ్యంలో ప్రశ్నిస్ తుంది ...
మనిషిలా తమ పర బేధం చూపదు
మాట విన్నా వినకపోయినా సరే
మార్గదర్శనం చేస్తూ మంచి దారి
చూపిస్తూ ఉన్నతంగా నిలిపే ప్రయత్నమే ....
ఘనీభవించిన మంచు నీరయిన
చందంగా ....జాలి మాటల లోతులను
స్పృశిస్తే కరిగి కంటి ద్వారా పారుతుంది ......
కవిపుంగవులైతే కాగితంమీద కుమ్మరిస్తుంది ....
సుఖ దుఃఖాలకు కష్ట నష్టాలకు
ఆటుపోట్ల అలజడి సంద్రంలా
అతలాకుతలమౌతూ.... కళ్ళల్లో
ప్రదర్శించి తెప్పరిల్లుతుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment