ఆందోళన
తేది : 23-06-23
శీర్షిక : ఉరుకులు పరుగులు
ఉరుకుల పరుగుల జీవితాలకు
ఉడకేసుకు తినే సమయమేది ...
చీకటితో లేచి సూర్యునితో పాటుగా
పోటీ పడినా చేరుకోలేని గమ్యములే ....
సింహభాగం జనాభాకు చాలీ
చాలని జీతాలే .... పట్టీ పట్టని
బ్రతుకులే ... ఉన్న దానిలో
సర్దుకుంటూ ఉసురు తీసుకునే
దాఖలాలే ...
పిల్లల్ని బడికి బయలుదేరదీయడమంటే
ఉరుకులు పరుగులతో అమ్మానాన్నలకు
ఉదయాత్పూర్వమే యుద్ద తయారీల కవాతు…
ఎదురందించడం ముద్దు ముద్దుగా…
పిల్లలు బడికెల్లగానే బతుకు జీవుడాని
ఇల్లంతా సర్దుకుని…అలసట తీర్చుకుని
సరికొత్తగా ఆరితేరి సరంజామా సర్దుకోవాలి
రెండవ అంకానికి సిద్దంగా ఉండాలి అమ్మ…
మరో మినీ యుద్దరంగానికి … సన్నద్ధమౌతూ ....
పిల్లలతో బడిబాటల గుంజీలు
పెద్దలతో ఆరోగ్య రక్షణ కుస్తీలు
జన సమూహంలో దూరిపోయి
సమయపాలనలకు సలాము చేయాలి.
ఓపికలేని చిరునవ్వులతో విధి నిర్వహణలు
గావించుకుని....
ఉస్సూరుమంటూ
తిరుగు పయనమై .... శక్తినంతా కూడగట్టుకుని
మలి యుద్దానికి సన్నద్ధం కావాలి ...
నిత్యం జరిగే సత్యమైన తంతుకై .....
మేను మంచంపై వాలేంతవరకు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment