Sunday, May 26, 2024

తీరం చేరని కెరటం తేది: 05-07-2023 శీర్షిక: బాధా తప్తమే

 తీరం చేరని కెరటం 

తేది: 05-07-2023
శీర్షిక: బాధా తప్తమే 
సహస్రాధికం… 

పూచిన పూలన్నీ దేవళం 
చేరనట్టే.. నిలిచిన ప్రతీ పువ్వు 
కాయ కానట్టే ... కాచిన కాయలన్నీ 
పక్వము చెందనట్టే.. కారణాలేమైనా 
కంచికి చేరని కథలనేకం .... 

మర్మం ఎరుగని మనో సంద్రంలో 
మడతల కొద్దీ ఆశల ఆలోచన కెరటాలు 
అంకురించి ఆశయాల గమనాలకు 
చేదోడు వాదోడుగా మార్గమేస్తుంది .... 

ప్రతీ ఆలోచన కెరటం  ఆశపడినా తీరం  
చేరుతుందో లేదో రూపు కట్టి గమనపు తీరం....
తుఫాను గాలి తాకిడికి రుతుపవనాలు 
దిశలు మార్చుకున్నట్టు...  
ఆలోచన కెరటాలు కూడా పద్ధతి 
మార్చుకుని ఫలించడానికి 
ప్రయత్నించవచ్చు ... 

మార్పు చెందిన ఆలోచన కెరటం 
నేర్పుగా ఒడిసిపట్టి కూర్పుగా 
ఫలించలేకపోతే ...విచ్చుకుని 
విఫలం చెంది సంద్రములోనే 
సంలీనమౌతుంది .....  

ఆలోచన కెరటం అటు ఫలించక   
ఇటు తీరం కూడా చేరని 
సందర్భాలనేకం .....బాధా తప్తమే ... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment