గజల్
తేది : 30-12-2022
చతురస్ర గతి
4/4/4/4
మనసున మెరిసిన గీతం నేనే
తలచిన మురిపం భావం నేనే
తొలకరి జల్లుల విరిసిన బాలను
పిలిచిన పలికే రాగం నేనే
తేనెల మధురం గ్రోలఁగ భ్రమరం
పూవుల సొగసుల రూపం నేనే
యువతల మనసును దోచగ నిలిచిన
జిలిబిలి రాణిగ మోహం నేనే
అతివల తలపున వలచిన రాజస
నయనం కలిపిన స్నేహం నేనే
నగునూరి రాజన్న
No comments:
Post a Comment