అన్నీ మొహమాటాలే
ఆశ దోష అప్పడం వడ
ఆశపడ్డ మనసుకు భంగపాటు
అన్నింటికన్నా ఉత్తమం
అందరం అనుకోని అడుగులేస్తే .....
ఆచారాలు సంప్రదాయాలు
సంస్కృతి అత్యున్నతం...
అదేకదా మనదేశ సూత్రం
భిన్నత్వంలో ఏకత్వం ....
మనమంతా ఒక్కటే సమూహం
మనసంతా ప్రేమలే సందోహం
మరెందుకీ ఖేదం విచారం
మనసులలో బేధం భావం ....
ముందు నుయ్యి వెనకగొయ్యిలా
మాట్లాడకపోతే దైవ ద్రోహం
మాట్లాడితే మానవ ద్రోహం
అన్నీ మొహమాటాలే....
కుండెడు తేనెలో నీటి బొట్టులా
కుదేలయిన సమూహం ....
నిర్మలమైన నీటికొలనులో
నీరుగార్చిన పెంకాసుల కప్పగంతు లు ....
ప్రతి మనసులో ఓ తుఫానే ....
ఎలా మొదలెట్టాలి....
ఎక్కడని ప్రారంభించాలి
ఎంతని ఏకరువు పెట్టాలి
అందరికి తెలిసిన విషయాలే ....
మల్లెపూల వంటి మనసులే
కానీ అన్నీ గురువిందగింజలే....
ముందొక మాట వెనకొక మాట
ఎందుకు ఆధ్యాత్మిక చింతనలో
అతలాకుతలం చేసే భిన్నత్వం...
కలిసుండలేమా ఆలోచించండి
పెద్దమనసు చేసుకుని
అడుగులేసి ఆ దిశగా
పెద్దలంతా ప్రయత్నిచండి ....
లేదా అద్యక్షులో అడుగేయండి.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment