మెలకువ నుండి సుషుప్తిలోకి..
తేది : 19-09-2023
శీర్షిక : శాయశక్తులా కృషి…
కవిత సంఖ్య : సహస్రాధికం
అర శతాబ్దం దాటుకుని
పాతికేండ్ల పట్టం కట్టుకున్నా
పట్టుమని సాధించిన రేటు
అక్షరజ్ఞానాలలో అంతంతమాత్రమే...
అదేంటోగాని అప్పు చేసిన
పప్పుకూడులా... నాయకులకు
గుప్పుమంటూ కలసివస్తుంది
అప్పనాల పుణ్యమాని గొప్పగా ...
జల్లించగానే కారిపోయిన
బిల్లిబిత్తిరిలో అక్కడక్కడా
ఉన్న కొంచం తెలివితో కూడా
ఊకొట్టించుకోవాలనేమో ...
మత్తుపానీయాల జోరుహోరుతో
జోకొట్టిస్తున్నారు పాలకులు
ప్రజాక్షేత్రం పూర్తిగా మేలుకుంటే
పనులు సాగవని రూఢీకొచ్చా రేమో ?
అందుకేనేమో అధికారంలోఉన్నా
ప్రతిపక్షంలోఉన్నా మాటకు కట్టుబడి
కలసికట్టుగా కృషిచేస్తూ
ఆమడదూరం
ఉంచుతున్నారు
అక్షరబీజానికి లక్షల
జనాభాను నేటీకి ...
No comments:
Post a Comment