Wednesday, May 22, 2024

చిత్ర కవిత తేది : 09-06-2023 శీర్షిక : ముగ్దమోహనం

 చిత్ర కవిత 

తేది : 09-06-2023
శీర్షిక : ముగ్దమోహనం 

ప్రకృతి ఎంత రమణీయమో ... 
పావురాలు గింజలేరుకుని 
ముక్కున కరుచుకుంటుంటే 
మురిపముతో వీక్షించే చిన్నది .... 

నిండు పున్నమి పండు వెన్నెల 
పరుచుకున్న జాబిలమ్మలా 
ముగ్దమోహనమై వికసించె  
ముద్దుగుమ్మ  దరహాసం .... 

పసందైన పడుచుదనపు 
ఆలోచనల మునిగిపోయి 
పరిసరాలు పట్టని తత్వమై 
తమకంతో ఆనందించుచుండె .... 

చెలి నవ్వులే విరి పూవులై 
సిగలో తురిమినదా .... 
పరధ్యానపు చూపులలో 
పసికట్టవచ్చునేమో చిన్నదాని 
చూపులలో నిలిపిన ఊసులు  .... 

మరీచికలా మనమున 
తొలిచిన వింత కోరికా .... 
మనసైన వాని చిత్రము
గోచరించి దోబూచులాడెనా 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment