భక్తి గీతాలు.
29-07-2023
పండరినాసా….
పండరివాసా పరమపావనా
నిండుగ నిన్ను కొలిచేమయ్యా
దండి దొరగా దర్శనమీయగ
మెండుగ నిన్ను మొక్కెదమయ్యా
// పండరి వాసా //
భీమానది తీరములో
భామా రుక్మిణి సమేతమై
విఠోభాగా వెలసితివి
పండరీపురమున ప్రసిద్ధముగా…
// పండరి వాసా //
విష్ణు రూపమే వివరమీయగా
దక్షిణ కాశీగా విలసిల్లినది
దశావతారములే తోరముగా
దాసులనెందరినో బ్రోచితివి ...
// పండరి వాసా //
వాగ్గేయులకు వరములనొసగి
వరపుత్రులుగా నిలిపావు….
మహిమలనెన్నో చూపావు
మర్మములను బోధించావు ....
// పండరి వాసా //
నగునూరి రాజన్న
No comments:
Post a Comment