Wednesday, May 22, 2024

చూపుడు వేలు తేది :09-06-2023 శీర్షిక : మానవ కళ్యాణం

 చూపుడు వేలు 

తేది :09-06-2023
శీర్షిక :  మానవ కళ్యాణం                       
సహస్రాధికం   

అబ్బో ! దాని మహత్యం 
చెప్పలేనంత ....ఓటరుగా విచక్షణలు 
పాటిస్తే బహు సుందరం ....లేదంటే 
జీవితమంతా  చిందర వందరం .... 

దేశంలో రావణకాష్టాలు రంగరించుకుని  
బొగ్గులు ఎండబోసుకోని బావురుమనాలన్నా .... 
పచ్చగ పరిఢవిల్లే పుచ్చ పూలు 
పోలు వోసుకుని ... పుసుక్కున 
నవ్వాలన్నా ... అంతా దాని మాయే ... 

ఏదైనా సరే ... నిత్యచైతన్య శీలమై 
మానవత్వపు మల్లెల సౌరభాలు 
పంచుతూ .... ఆత్మీయతలు 
తట్టి లేపి అనురాగాలు పంచాలి .... 

మానవాళి మరో అడుగు ముందుకు 
వేసి ఋషిత్వం సంతరించుకోవాలి 
మానవ సంక్షేమాలు  కళ్యాణాలు కోరాలి .... 
నాకేంటి లాభం అంటూ స్వార్థాలతో 
రాక్షాసానందాలు పొందడం కాకూడదు.... 

దశా దిశా నిర్దేశాల చూపు కావాలి 
దార్శనికతల వెలుగులు  పంచాలి  .... 
విద్య విజ్ఞానాలు విరజిమ్మే కాంతి పుంజమై 
వరదాయిని చల్లని చూపు కావాలి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment