Thursday, May 30, 2024

గజల్ 11-08-23 6/6/6/6 గతి.

 గజల్ 

11-08-23
6/6/6/6 గతి. 

గోకులమున నివాసమే 
మురిపములే మన్మోహన 
యశోదమ్మ ప్రేమలతో 
సాధనలే మన్మోహన

గోపెమ్మల మనసునిండ 
మురిపముగా నిలిచితీవి
ఎదలన్నీ అమలినమే
తాపములే మన్మోహన 

అడుగడుగున ఆనందము 
చిలిపి చిలిపి చేష్టలతో 
పాలు పెరుగు వెన్నలన్ని 
తాగెనులే మన్మోహన 

నీజపమే సేదదీర్చు 
ఇలలోనా కలలోనా 
నీకబురే  ప్రతిదినమూ 
నీమాయలే మన్మోహన 

చూపులలో మాయేదో 
సూదంటుగ మధుసూదన 
వేణువునూ రవళించగ
రాజువులే మన్మోహన 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment