Wednesday, May 22, 2024

కళాశ్రీ సాహితీ వేదిక అంశం : చిత్ర గజల్ తేది: 21-06-2023

 కళాశ్రీ సాహితీ వేదిక   

అంశం : చిత్ర గజల్ 
తేది: 21-06-2023

అలంకార శోభితమై 
నిలిచినదీ  ముగ్దవనిత 
అందమంత ఆరబోసి 
మురిసినదీ ముగ్దవనిత 

చుక్కలన్నీ బక్కచిక్కి 
పక్కనెళ్లి నక్కినవీ 
చందురుడూ మరుగాయే 
విరిసినదీ ముగ్దవనిత ... 

కొప్పులోన మల్లెలతో 
కొసిరినవీ చూపులన్ని 
మదినిండిన తలపులతో 
మెరిసినదీ ముగ్దవనిత ... 

సూదంటూ రాయిగాను 
మోదమైన దృక్కులతో 
అభినవాల శిల్పంలా 
అమిరినదీ ముగ్దవనిత 

అరవిరిసిన అందములా 
చిరునవ్వుల మంద్రముతో 
రాజసమే నింపుకునీ 
నిలిచినదీ  ముగ్దవనిత   

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment