Sunday, May 26, 2024

మళ్ళీ మళ్ళీ రాయాలని ఉంది తేది : 03-07-23 శీర్షిక: పునశ్చరణల మురవాలని

 మళ్ళీ మళ్ళీ రాయాలని ఉంది 

తేది : 03-07-23
శీర్షిక: పునశ్చరణల మురవాలని 
సహస్రాధికం. 

బాల్యంలోని ఒక్కొక్క బంగారు వర్ణాలను 
ఒడువని పునశ్చరణల పుణ్యాలతో 
కనులారా దర్శించి కలలను స్పృశించి 
తనివి తీరా చూసుకొని మురవాలని… 

అమ్మ ఒడిలోన ఆదమరిచి 
పడుకున్న క్షణాలను పట్టి బంధించి
పదే పదే మనసున నిక్షిప్తం 
చేసుకుని పరవశించి మురవాలని .... 

శ్రీపతంటి  సోపతులతో 
చిలిపితనపు కొట్లాటలను 
మననంతో మల్లెపరిమళాలయే 
చిల్లర మల్లర సరదా తగాదాలను... 

సరాగాల జీవన పయనంలో 
సంభ్రమించిన క్షణాలన్నింటిని 
సలలితముగా పొదువుకుని 
జీవనగమనంలో సహారాగా చేసుకుందామని...

అమితమైన ఆధ్యాత్మికతల ఆనందం... 
అయ్యప్ప కొండపైన జ్యోతి దర్శనపు క్షణాన 
వర్షించిన కనులు..స్రవించిన గుండెలయలు
ఇక చాలనుకున్న జీవన మధురిమలు...

అడుగడుగున మననంతో ఆనందం 
ద్విగుణీకృతమై..బాధలను పటాపంచలు 
చేసి..పరిసరాలు మరచిపోగలిగే
ప్రతీ ఘటనల జ్ఞాపకాల ముచ్చట్లను
మళ్ళీ మళ్ళీ రాయాలని ఉంది … 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment