Thursday, May 30, 2024

గురక 17-08-23 శీర్షిక ఆరోగ్యంలో బెరిక

 గురక 

17-08-23
శీర్షిక ఆరోగ్యంలో బెరిక

 మెరికలాంటి శరీర సౌధాలకు 
 అలసిన వేళ అల్లుకునే మల్లిక 
 పక్కవారి ఓపికలకు పెట్టే చురక 
 నిక్కచ్చిగా ఆరోగ్యంలో ఏదో బెరిక.... 

ఆరోగ్యాలలో ఏర్పడే తూట్లు 
 అందునా మార్చుకోని అలవాట్లు 
 స్థూలకాయమైతే సుందరమైన ఫ్లాటు.. 
ఇక ఎదురులేని ఫీటు .... 

 ఎవరిది వారికి ఎరగని మాటే 
 పక్కవారికేమో గ్రహపాటే 
 నిక్కచ్చిగా తగిన జాగ్రత్తలు 
తీసుకోపోతే ఆరోగ్యాల ఏమరుపాటే.. 

చిన్న చిన్న మార్పులతో 
 చింత కొంత తీరునేమో 
 ప్రయత్నించి సాధిస్తే 
 పదుగురికి మేలే కద ఇంటిలో... 

 అమ్మల.. అమ్మమ్మల చిట్కాలు 
 అలవోకగా పాటించి మూటగడితే 
 ఆరోగ్యపు మెరుగులతో ఆనందమై 
 ఇంటిల్లిపాదికి ఇరకాటం బాపు ... 

నగునూరి రాజన్న. 

No comments:

Post a Comment