కవన రవళి. వచన పద్యాలు.
27-06-23
నగునూరి రాజన్న.
1. మాటలేమో జోరువానలంటుంటే
మబ్బులోమో దోబూచులాడుచున్నవి
మాటనమ్మాలో..మబ్బును నమ్మాలో..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ రామా హరీ!!
2. పాల్థీన్లు లేని పరిసరాలు…
కల్తీలులేని పండ్లు కూరగాయలు..
కాలుష్యం లేని వాతావరణం…
ఈ కలలన్నీ నిజమైతే చాలు!
మహాప్రసాదమే!!
3. పాలనలంటే పడరాని కష్టాలు మిత్రమా…
ఎంతంటే ఏమని చెప్పను సోదరా…
సంపాదనలు రహస్యంగా ఉంచుకోలేనంత…
ఏమి చేసేదనిక! మరో దారి లేదిక హరీ!!
4. సమయమే చాలడం లేదు.
సమూహలనేకమై సందోహం చేస్తుంటే…
సరిగ్గా చివరి నిమిషం పరీక్షలా…
అనుకున్నదొకటీ అయినదొకటీ రామా హరీ!
27-06-23
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment