ఇప్పుడొక ఊరు కావలి
తేది : 20-06-2023
శీర్షిక : కాకమ్మ కథలకు ఖాళీ లేవు ....
సహస్రాధికం
ప్రజాస్వామ్యము ఫరిఢవిల్లుతున్న
మహావృక్షంలో కొమ్మలు రెమ్మలతో
అక్షరాలా ఆరున్నర లక్షలు లెక్కగా
చివుళ్లు వేసి పచ్చని తరువుల్లా ...
చిలువలు పలువలైన
చిత్రమైన పరిస్థితులలో .....
ప్రణాళికల పందిళ్ళలో చేర్చి
ప్రాంతాలన్నీ పంచుకోబడి
అభివృద్ధికి మాయా మంత్రాలతో
తంత్రము చేసి హుష్ కాకి అంటుంటే ......
పాలకపక్షాలు ప్రతిపక్షాలు
వజ్రోత్సవాల వాకిట నిలిచి
ఈ ఊరిని అది చేసేస్తాము
ఆ ఊరిని ఇది చేసేస్తామని ...
పోటాపోటీగా వాగ్దాన బాణాలు
కుమ్మరించుకుంటుంటే....
చేసిన చాంతాడంత వాగ్దానాల పట్టికలో
దేశంలోని ఊళ్లన్నీ అయిపోయాయి ....
మహాభారతంలో ఓపికవంతులు
ఒద్దికగా ఐదూళ్ళు అడిగినట్టుగా ...
ఇప్పుడొచ్చి ...
ఒక ఊరు కావాలంటే ఎలా ?
కాకమ్మ కథలు చెప్పడానికి
ఖాలీ లేనే లేవు .... సోషల్
మీడియాల పుణ్యమాని ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment