చిత్తు కాగితం
తేది : 18-08-2023
శీర్షిక : మన దేశపు సగటు మనిషి
ప్రతి ఐదేండ్ల కొక్కసారి పండగె
యాదవుడవు నీవే ... మాధవుడవు నీవేనంటూ
ఓట్ల జాతరొస్తున్నదంటే
ఓటర్లంతా అప్పుడే బయటికొచ్చిన
తళ తళలాడే తెల్ల కాగితాలే ...
మానస సరోవరపు అంచులకు తీసుకెళ్తానంటూ
మనసున ఎడారిని నింపుకున్నమహానాయకులు
మరీచికలను చూపించి ఒయాసిస్సులంటూనే
ఆధునిక పాండిత్యపు తలరాతలతో
అండదండలు అవుతానంటూ నమ్మబలుకుతారు ...
కొందరు ....
ఇంటిలోపలికి ఈగలా చొచ్చుకొచ్చి
కడుపులోపల తలను ఆనించి ...
పళ్ళికిలించుకుంటూ పనిస్థలానికి వచ్చి
ప్రకటనలకు పోజులిచ్చి ప్రచారాలకు
ఆయుధాలను సమకూర్చుకుంటారు....
ఒడెక్కదాక ఓడమల్లప్పలా
వెంట వెంట తిరుగుతూనే
పెంటెత్తి పోయడానికైనా సిద్ధమని
తదుపరి పంటి కింద రాయిలా మారతారు. ....
ఒక్కసారి ఎన్నికయ్యారో ఐదేండ్ల
వరకు ప్రజలంతా చిత్తు చిత్తే ...
పడిగాపులే ఆపతి సంపత్తిలకు ...
ఆనక అడుగుపెట్టలేరు
ఆ ఇంద్ర భవనాలలోకి ....
No comments:
Post a Comment