చిరునవ్వుల గుమ్మం
తేది : 31-05-2023
శీర్షిక : అమ్మ చిరునవ్వు ..
సహస్రాధికం
గల్లు గల్లున గజ్జెల మోతలతో
చిలుక నవ్వుల చిన్నపిల్లలు
చిరునవ్వులు రువ్వగానే ....
చింతలన్నీ హాంఫట్... చెట్టు మీద
కాయ చెంతకు దించినట్టే మాయం ....
ఒళ్ళంతా హూనం చేసుకుని
ఇంటిల్లిపాదికి ... ఎదురు చాకిరీలతో
బదులు చెప్పకుండా చేసుకుంటూ
పోతుంటే ....చంటాడు కాళ్లకు అడ్డం
పడగానే హుష్ కాకి అయిపోతుంది ....
ఇంటిళ్లిపాదికే కాకుండా ...
బంధు మిత్రులకు... అతిథులకు
అభ్యాగతులకు ఆనందాల
ఆహ్వానమే అమ్మ చిరునవ్వు ....
పెరిగి పెద్దయి చదువులరెమ్మలకు...
కొలువుల కొమ్మలకు వెళ్లినా
కళ్ళకు నీళ్లు పెట్టుకుని సాగనంపినా ...
నాలుగు ప్రేమగల్ల మాటలకై నిరీక్షించేది ....
అందరి విసుగుల మూటను మోసి మోసి
ఎన్ని సార్లు తనను తాను సర్దిచెప్పుకుని
తిరిగి నిత్య బాధ్యతల కార్యోన్ముఖురాలైనదో...
సహనపు తరువు నీడలలో సేద దీరిందో .....
ఏదిఏమైనా ఇంటి గృహలక్ష్మి
వెంట నడుస్తూ చిరునవ్వులు చిందిస్తేనే
ఇంటిల్లిపాది సుఖ శాంతులే ....
ఆ ఇళ్లెప్పుడూ చిరునవ్వుల గుమ్మమే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment