పొగాకు
తేది: 31-05-2023
శీర్షిక : అనారోగ్య మైల మూటలు
మత్తు పానీయముల చిత్తుగా తాగిన
తనువు నష్టం తమవరకే పరిమితం ....
చుట్ట కాల్చువాడు చట్టబండలు చేయు
స్వస్థత తనకే కాదు తనవారికి కూడా ....
చలికి గిలిగింతలు అంటూ కొందరు
చలాకీకి ఇంధనమంటూ మరికొందరు
డాబు దర్పం వెలగబెడుదురు ఇంకొందరు
ఏది ఏమైనను లుప్తమే ఆరోగ్యము .....
ధోతి రుమాలు చుట్టుకున్న చుట్ట
బీడి అయినను .... పాంటు చొక్కా
వేసుకున్న సిగరెట్లయినను ....
ఉత్తర భారతపు గుట్కా పాన్ జర్దాలయినా
ఒళ్ళు హూనం ... గుళ్ల ధనం ....
థ్రిల్లు కోసం మొదలయ్యి
డ్రిల్లు వేస్తుంది తనువుకు ...
గుల్ల చేయగానే ఆరోగ్యం .
బిల్లు పేలుతుంది మందులకు
డాంబికములు నెత్తికెత్తుకుని
జాం జాం అంటూ సోకులకు బాకాలూది
ఊపిరితిత్తుల ఉసురుపోసుకుని
శ్వాసకోశమును మసి బారిచ్చుకుంటారు ...
తనవరకే కాదు సుమా
తరాలెన్నో తలకెత్తుకోవాలి
అనారోగ్యపు మైల మూటలు
తస్మాత్ జాగ్రత్త ! మిత్రులారా !
బుద్ది ఉన్నవాడే పెద్దవాడన్నట్ టు
మంచి చెడులు బోధించాలి పెద్దలైనా
పద్ధతి తెలిసిన శాస్త్రజ్ఞులైనా
పట్టుబట్టి ప్రభుత్వాలైనా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment