పడి లేచే కడలి తరంగం ....
తేది :31-03-2023
శీర్షిక : అనుభవ సారం
సంఖ్య: సహస్రాధికం
పడి లేస్తుంటేనే పట్టు కుదురు
అనుభవాల సారాలు ....
మంచి చెడుల జీవన గమనంలో
పదే పదే ఉదాహరణే .. పడి లేచే
కడలి తరంగం ....
పరీక్ష తప్పే విద్యార్థులకు
పటుతరమై బోధనలౌను ....
పట్టుదల కృషి చేయాలంటూ
కడలి తరంగాల పాట్లు ....
మాటవరసలకు మాటైనా
పెట్టుబడులకు మూటైనా
పట్టుకోవడం ... వదిలిపెట్టడం
రెండూ అంత్యంత ప్రధానమే .....
సంపద పట్టుకోవడం గొప్పదే అయినా
పట్టువిడుపులతో ఎక్కడ వదలాలో
తెలుసుకుంటే ... అంతకంటే గొప్పది ....
వాటాల విపణిలో పెట్టుబడులలాగా ....
కాల మహిమలు చీకటి వెలుగులైతే
కాచి వడపోసే విజ్ఞాన వీచికలు
గెలుపోటములు.... అనుభవాలు
గడిస్తేనే ... ఆవలితీరం తేలికవుతుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment