తెర వెనుక
తేది 04-04-2023
శీర్షిక : అనంతం .....
సంఖ్య : సహస్రాధికం
సమయసూచీతో సరిదంటగ
అమ్మలు పరిగెత్తితేనే...జివ్హ రుచులు
జీర్ణించుకునే కమ్మని భోజనాలు
విందు చేయు ఇంటిల్లిపాదికి .....
కాలంతో పాటుగా కదం కలిపి నాన్నలు
ఉరుకులు పరుగులు లంఘిస్తేనే ...
అవసరాలన్నీ తీరి ఆదమరుచు ...
ఇగురించిన ముఖారవిందముల
దరహాసములై ఇంటిల్లిపాది ....
కనపడని శ్రమవీరుల రుధిరం
స్వేదమై చిందితేనే .... కనులకు
కమనీయపు అందాల దృశ్యమాలికలెన్నో
ఆవిష్కారమై సుందరతలు మూటగట్టు.. ..
అనాదిగా వచ్చే ఆచార సంప్రదాయమే ...
పాలరాతి సౌదాలైనా .... పరిమళాలు విరజిమ్మే .
ఉద్యానవనాలైనా....పట్టుదల దీక్షల
పెట్టుబడి పరిశ్రమలతో తయారైన కానుకలే ....
అనేక నైపుణ్య విభాగాలు ఏకమైతేనే ....
ఆకట్టుగోగలిగే వెండితెరల దండిదొర
కోట్ల మంది వినోదాలకు కోటగోడలయ్యేది
ఒక చక్కని మరువలేని చిత్రరాజముతో...
కంటికి చిక్కని ఖగోళ మండలంలో
మింటికి చేరని భూగోళ గ్రహం ...
రెంటికి నడుమన వేలాడు
అదృశ్యమానమే ఆ కనపడని శక్తి ....
చేతిలో ఇమిడిపోయే బీజము
చెట్టుగా మారిపోయే అతిశయం ....
అనంతమయ్యే ఆధ్యాత్మికశక్తి
కనగలిగితే మనిషి మహా ఋషి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment