Monday, May 20, 2024

ఇప్పుడు నాకు ఓ కొత్త భాష కావాలి తేది డ్:28-03-2023 శీర్షిక : అవును ఓ కొత్త భాష కావాలి...

  ఇప్పుడు నాకు ఓ  కొత్త భాష కావాలి

తేది డ్:28-03-2023
శీర్షిక : అవును ఓ కొత్త భాష కావాలి...  
సంఖ్య : సహస్రాధికం 

అనుభవాల తోటలో అటుఇటు నడిచి 
అలితేరితే గాని బోధ పడని సందర్భం .... 
అమ్మ పడిన ఆరాటాల సంద్రపు లోతు 
నాన్న పడిన పోరాటాల గగనపు ఎత్తు .... 

దండి సౌకర్యాల నిండైన చావడిలో 
మేమిద్దరం మాకిద్దరు చాలంటూ కూడా 
మూలిగి ముక్కి మూడడుగులు ముందుకు 
ఆరడుగులు వెనకవేసే మనమెక్కడ .... 

అరకొర కాదు అసలుకే మోసమై
సౌకర్యాల మాటలు కూడా సక్కగ కానరాని 
సత్తె కాలములో నిత్యమై కంటికి రెప్పలా 
కాచుకుని ఐదారుగురు మందిని  అలవోకగా 
పెంచగలిగిన అపర మేధాశక్తికి జోహార్లంటూ .... 

సవాలక్ష సౌకర్యాల సంతలో నిలబడి కూడా 
చిన్న చిన్న చింతలకే అప్పుడప్పుడు చిత్రంగా 
మాయమై పోతున్న.. చిరుదివ్వెలను తలుచుకుంటే....
సంధి కాలంలో నిలిచిన మనం కొంత  
ధైర్య వచనాలు చెప్పడానికి .... 

ఘనమైన రాజుల భుజకీర్తుల గాలి సోకి కూడా 
గౌరవ స్థానాలలో ఆసీనమై.. తగని పనులను  
తలకెత్తుకుంటూ  గంజాయి మొక్కలై కళంకాలు
మూటకట్టుకుంటున్న కొంతమంది కొరకు ..... 
అవును ఓ కొత్త భాష కావాలి నాకిప్పుడు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment