Monday, May 20, 2024

శ్రమ తేది : 31-03-2023 శీర్షిక : రత్న రాసులు ....

 శ్రమ  

తేది : 31-03-2023 
శీర్షిక :  రత్న రాసులు ....  

రుధిరం స్వేదమైతేనే 
నోరు మధురమై... ఉదరం 
నిండేది.... చీకటి వెలుగుల 
చక్రంలా వింత గొలిపే నిరంతర
 ప్రక్రియ .... 

సర్వాంతర్యామిలా వ్యాపించినది ... 
అన్ని సంపదలకు మూలం శ్రమ... 
వ్యక్తులకైనా...దేశాలకైనా...విశ్వానికైనా... 
అయినా ఆకలిని జయించలేకపోతుంది  ..... 

ఒకప్పుడు అంగబలంతో 
వంగబెట్టి లొంగదీసుకుని 
దాస్య జీవితాలను దఖలు 
పరిచారు...తరాల తరబడి .... 

ఆకలికి పేగులు కదిలి వంకర్లు పోతుంటే.. 
కూలి డబ్బుల్లో కూడ బలుక్కుని బేరం పెట్టి 
కొన్నాళ్ళు... కష్టానికి తగిన ప్రతిఫలాలు 
కార్మికులకు అందకుండా చూసారు .... 

మరోవైపు సంక్షేమ సంగతుల పేరుజెప్పి 
ఉచితాల ఊసులతో  పథకాలు త్రాసులు 
ప్రవేశపెట్టి ... సోంబేరులకు వారసులను చేసి ...
పలుపుతాడుతో బంధించి పామరులను 
చేస్తున్నారు .... 

కారణాలేమైనా కథాసారాంశమంతా
చివరాకరుకు చిత్రంగా  ఒకటే సుమా .... 
అంగబలం, అర్థబలం, విజ్ఞానం, రాజకీయం.. 
కలిసికట్టుగానో ... విడివిడిగానో ....స్థాయి ప్రకారంగా 
పోరాడుతూ శ్రమపై దాడి చేస్తూనే ఉన్నాయి... 
నాగ "మణి" లాంటి శ్రమ రత్నరాసులను
కొల్లగొడుతూ ..పోగేసుకోవడంలో ....పోటీలే ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment