Monday, May 20, 2024

చిత్ర కవిత తేది: 02-04-2023 శీర్షిక : రుధిరం పారని స్వేదం .... (( కాగితం కలం సిరా చుక్కలతో ))

 చిత్ర కవిత

తేది: 02-04-2023
శీర్షిక : రుధిరం పారని స్వేదం .... 

వేన్నీల భావాలతో వెలుగులీనుతూ  
మల్లెల సౌరభాలను మోసుకుంటూ....  
ఎల్లరి మేధో మదనాలకు తావిస్తూ 
అక్షరీకరించుకుంటుంది అణుకువతో
ఆయుధమై వర్థిల్లడానికి ..... కాగితం 

అమ్మ హంసవాహిని అంశతో జన్మించి 
అనుభవాల తోటలలో విహరిస్తూ 
కుసుమ పరిమళాలను వెదజల్లుతూ 
మానవాళికి సవ్య మార్గదర్శకమై....  
మహిమాన్వితమే మహితలంలో .... కలం 

అన్యోన్యమైన అనుబంధంతో  
అజరామరమై నిలుస్తుంది .... 
అమృతవాహినియై కురుస్తూనే 
అక్షరాలు  పూలవనాలై  విరుస్తాయి .... 

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా 
ఇప్పుడు రూపం మార్చుకుని కులికినా 
సంస్థలను వ్యక్తులనెందరినో పోషిస్తూ 
అప్పుడప్పుడు తప్పులు చేస్తున్నా ... 
ఒప్పుల కుప్పనే  తానెప్పుడూ .... 

రుధిరం పారకుండానే  స్వేదం చిందించి
ప్రజల పక్షాన .... పాలకులను 
శ్రామికులకు వత్తాసుగా ... పెట్టుబడిదారులను  
అన్యాయాలను ... అధర్మాలను .... అనుచితాలను 
గదమాయించి...  మంచి చెడుల మతలబులు 
తెలిపి.. మధురమైన కార్యక్రమాలెన్నో చేపట్టి 
సుందరమైన ఆవిష్కారాలతో 
చక్కబెట్టే మహిమాన్విత .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment