Tuesday, March 19, 2024

దుర్లక్షణాలు తేది : 30-03-2023 శీర్షిక : చాడీల చావడి

 దుర్లక్షణాలు 

తేది : 30-03-2023
శీర్షిక : చాడీల చావడి 

మేకతోలు కప్పుకున్న 
క్రూరమృగమైన  పులిలా .... 
పైపైన మంచిగా కనపడి 
చాపకింద నీరులా చావు దెబ్బ 
తీస్తుంది .... 

మేడిపండులా కనపడినా 
పురుగులు నిండి తినలేక .... 
స్వంతానికి సహకరించవు 
ఎదుటివారిని ఉపయోగపడవు  ... 

సరదాగా మొదలౌతుంది 
సాంతంగా మింగేస్తుంది .... 
మత్తుమందుల క్రీనీడలా 
మొత్తం ఆరోగ్యానికే ఎసరు .... 

చాడీల చావడిలో నిలబడి 
కల్లబొల్లి మాటలతో చెవులు 
కొరికించి... చెప్పు చేతల్లో 
నిలుపుకుని....తప్పులు చేయించడం .... 

అసూయా ద్వేషాలు అలుముకుని 
కామ క్రోధ మద మాత్సర్యాలనే  
చెడుగుణాలు అంటిపెట్టుకుంటే 
వచ్చే బిరుదులే  అవలక్షణాలు ..... 

కోపతాపాలకు కొంగుచాపకుండా 
నిఖార్సుగా నిలబడగలిగితే 
ఎవ్వరైనా సద్గుణశీలురే .... 
సత్య హరిశ్చంద్రులై  సమసిపోవా 
సమస్యలన్నీ .... 

No comments:

Post a Comment