తెలంగాణ అస్తిత్వం అభివృద్ధి
తేది : 29-05-2023
శీర్షిక : జగజ్జేత ...
వందలేండ్లు వలస పాలనలతో
వట్టిపోయిన గొడ్డయ్యింది తెలంగాణ ...
దశాబ్దాల కొలది దాయాదుల
పాలనలో పక్షపాతాల పాలైంది .....
సమైక్య రాష్ట్రములో సచివాలయం ముఖం
కూడా చూడని వారెవరంటే తెలంగాణోళ్ళు...
చివరి బంతి భోజనంలా ఎప్పుడూ
చిన్న చిన్న ఉద్యోగాలే ...ఇక్కడోళ్ళకు.
అభివృద్ధి అడుగుజాడలన్నీ
అక్కడోల్లకు తివాచీలు పరుస్తుంటే ...
వలసలతో సల సలమని కాగి
నిరసనలకు దారి తీసింది ....
మాటలలోనే మౌలిక సదుపాయాలు ...
బడి జాడలు లేవు ...గుడి జాడలు లేవు ..
చదువు సంధ్యలకు సౌలతులేదు
యాత్రల గోత్రాలు తెలువదు ...
ప్రాజెక్టుల గొడుగులు కానరావు .. ఇక్కడ…
భాష యాస కవులు కళాకారులు
కడకు కాకతీయ కళా వైభవాలు కనుమరుగే ...
చిన్న చిన్న ఘర్షణలకు చిత్రంగా మతం రంగు
పులిమి మభ్య పెడుతుండేవారు ....
నీళ్లు నిధులు నియమాకాలంటూ
నిగారించుకున్నది అగ్నికణం ....
సల్లు బిగి అవుతూనే ... సరైన సమయంలో
సంధి కొట్టి సకల జనుల సమ్మెతో ఉదృతమయ్యింది ...
కరకర పొడిచే పొద్దును చీల్చుతూ
ఎల్ బి నగర్ జంక్షన్లో వందలమంది మధ్య
తొలికిరణం రూపంలో శ్రీకాంతాచారి
మరణం అశనిపాతమై ఎగిసింది .....
1200 మందిదాకా అందరూ అమరజ్యోతులే ... .
పల్లె, పట్నం, ఊరు, వాడ ఏకమై ఉద్యమం ఉప్పెనైంది
సకల జనుల సమ్మెతో ఉద్యమ ఉనికే మారి పోయింది
కళాకారుల హోరుతో కదం తొక్కి ఉవ్వెత్తున నిలిచింది
దిగి వచ్చిన కేంద్రం దిగ్విజయముగా అందించినది 29 వ రాష్ట్రంగా…
నడకలు నేర్చి పరుగు లంఘించుకున్నది ...
లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను చంకనేసుకుంటూనే
శాశ్వత ప్రాతిపదిక పనులకు శ్రీకారం చుట్టారు ...
కనురెప్ప పాటు కరంటు
పోకుండా
కష్టాలను తీర్చి
రైతు బంధుతో ఎవుసానికి భుజమానించి
విశ్వవిఖ్యాతమైన కాళేశ్వరం ఎత్తిపోతలతో
కోటి ఎకరాలకు నీటి సౌకర్యంతో రైతుకు నీరాజనమే ....
బడుగు బలహీనులను కనిపెట్టుకుంటూ
శాంతిభద్రతలకు పెద్ద పీట వేస్తూ
సాంకేతికతలో ఉద్దండ పిండముగా మారి
దేశ ప్రతిష్టను ఇనుమడించిన జగజ్జేత ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment