స్వప్న విహారం
తేది : 29-05-2023
శీర్షిక : దీక్ష దక్షతలు పెట్టుబడైతే ...
జీవరాశిలో దివ్యమైన వైవిద్యం
సత్తా వెలుగుల మానవ మేధ తథ్యం
ప్రతి ఆలోచనల తరంగం ప్రగతే గమ్యం
ప్రణాళికలతో ప్రయత్నించి సాధిస్తే
పలకరించలేమా మానవ కళ్యాణం ....
నిర్మలమైన మానస సరోవరంలో
నిలకడలేని ఊహలకు రెక్కలొస్తుంటే
అమూల్యమైన ఆలోచనా తరంగాలను
మీటి విలువైన గమ్యాలను నిర్దేశిస్తే ....
ఆశలు ఆశయాలను దర్షింపచేస్తే
అకుంఠిత దీక్షల మేధోమదనంతో
అలల తరంగాలన్నీ కలలతీరం చేరేవరకు
కంటిమీద కునుకే గగన కుసుమం ....
చిన్నబుచ్చే చీత్కారాలను చిదిమే సి
అర్హతలేని అవహేళనలు శిలువవేసి
నమ్మకాలను అమ్మగా హత్తుకుని
అహోరాత్రులు మమేకమై పోవడమే ....
అత్తస్థైర్యాలను అందిపుచ్చుకుని
దీక్ష దక్షతలను పెట్టుబడి చేసి
స్వీయ క్రశిక్షణాల సిపాయిగా మారితే
గుట్టువిప్పదా చిక్కులు ...పట్టుచిక్కదా విజయం...
ఓర్పు నేర్పులతో సాగే ఓంకారం
అద్దంలాంటి సత్యదర్శనం
సానుకూల ధర్మదక్షతలు
సర్వసమ్మత న్యాయ సూత్రాలు
సకారాత్మక దిగ్విజయ రాచమార్గాలు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment