ముక్త కంఠం
తేది : 29-05-2023
శీర్షిక : ప్రజల ముక్తకంఠం
సంఖ్య : సహస్రాధికం ...
వందలేండ్ల వలస పాలనలకు
కొంత మంది వత్తాసు పలికినా ...
బూటు కాళ్ళకింద భూమి మీద
నలిగిన లెక్కలేని తరాలెన్నో..
నమ్మకమైన నాయకత్వం
నడకలు సాగించిందంటే ....
ఊరు వాడ ఒక్కటైపోయి
ముక్తకంఠమై నినదిస్తుంది....
బింకంతో శంఖమూది
ఎన్నాళ్ళు జోకొట్టగలం ....
ప్రజా ఉప్పెనలో పతనమై
పలాయనం చిత్తగించిన
దాఖాలాలెన్నో ....
పాలనేదైనా ప్రజల సంక్షేమం
కోరుకుంటేనే సురక్షితం ....
ప్రజలందరినీ చంపేసినాక
పాలించేదెవరిని ఈ నాయకగణం ....
ఓటుకు నోటు అనే నానుడికి
ఆజ్యం పోసిన నాయకత్వం. ....
దిగజారుడుతనం ఏమాశించి ....
అతి తక్కువ సమయంలోనే
ఆగర్భశ్రీమంతం సొంతమవాలనా ?
ఎదురు ప్రశ్నించినవారికి
బదులు జవాబివ్వలేక బలి ....
ఎందుకింత ఉద్రేకం ...
ఎందుకంత ఉక్రోషం ....
స్వార్థాలను భుజానేసుకుని
సంబరాలు జరుపుకోవడం...
స్వయంకృషిమీద నమ్మకం లేక
బలం బలగాన్ని కొమ్ముకాయడం ....
అందరికీ చెందిన అసాధారణ
ఆస్తులను తెగనమ్ముతూ రంకెలేయడం ....
జంబుద్వీపం పైన కొంభకోణాలు .....
ప్రజలంతా ముక్తకంఠమై ప్రశ్నలతో
ముందుకెవరు రారనే విశ్వాసం ...
ఎదురు ప్రశ్నించరనే ధీమా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment