నందమూరి తారక రామారావు
తేది :28-05-2023
శీర్షిక: యుగ పురుషుడు.
వైవిధ్యమైన నామం
విభిన్నమైన స్వభావం
దీక్షా దక్షతల సంకేతం
పట్టు పట్టి సాధించే తత్వం …
తెలుగింట అన్నకు చిరునామా
మదరాసి మరకను తుడిచి
తెలుగువారికి దశదిశలా విశ్వవ్యాప్తంగా
తిలకం దిద్దిన ధీశాలీ…
చారిత్రికంలో చక్రం తిప్పి
జానపదాలలో జనం మనసు దోచి
సాంఘీకంలో సమభావం చూపించి
పౌరాణికాలలో ప్రాణ ప్రతిష్ట గావించి
కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు…
మనదేశం మైలురాయిని
పాతాళభైరవితో బద్దలుకొట్టి
మాయాబజార్లో మర్మం జోడించినా
భూకైలాస్ లో రావణబ్రహ్మయినా
లవకుశులో రాముడిగానైనా ....
శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు గానైనా
తెలుగువారి ఆరాధ్యం సర్వామోదం….
బృహన్నలగా శాస్త్రీయ సంగీతం
నేర్చుకుని... అలవోకగా అతిపెద్ద
సంభాషణలను చెబుతూ
కెమెరాముందు తడబడని తత్వం ...
రాజకీయమైనా రమ్యమనోహరమే
బడుగులు బలహీనులకు
రెండు రూపాయిలు కిలో బియ్యమై
బ్రతుకునిచ్చిన భరోసా సూత్రం ...
సినిమారంగంలో చిత్రంగా మెరిసి
రాజకీయంలో తుఫానులా దూసుకొచ్చి
తన ప్రాభవాన్ని నిరూపించుకున్న
నిత్యచైతన్య శీలి నిజ తపోధనుడు ...
లెక్కలేనన్ని అవార్డుల పంటలు
లెక్కకు మించిన సన్మానాలు
పక్కగా అందుకున్న పద్మశ్రీ బిరుదు
నటనలోన విశ్వ విఖ్యాత నవరస నటనా
సార్వభౌముడు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment