కారాలు మిరియాలు నూరడం
తేది : 29-04-2023
శీర్షిక : తన కోపమే తనకు శత్రువు ....
అహం బ్రహ్మాస్మి ....
నెత్తిమీద తైతక్కలాడితే
ఎదుటి వారంతా ఎర్రినాగన్నలే
నామాట చెల్లుబాటు కావాలి ....
సగం జ్ఞానములతోనే సంఘం ఏలుతారు ....
తెల్లగా ఉంటే ఓర్చుకోలేరు ....
పాత పగలు లేకున్నా పనిగట్టుకుని
కోప తాపాలు లేకున్నా ...కాపు కాసి...
ఈర్ష్యా అసూయలను ఇల్లరికం చేసుకుంటారు ...
చెప్పుడు మాటలకు చెవులు చాపి
తప్పుడు లెక్కలు సరిచేసుకోకుండా
హుంకరింపుల బెదిరింపులు ....
కారణం లేకుండా కలబడడం ....
మొండి వాదనలకు పెట్టింది పేరై
వితండ వాదాలను భుజాన వేసుకుని
సీతయ్య ఎవరి మాట వినడనే
చిలుక పలుకుల చిరునామాగా మారడం ....
అయినదానికి కానిదానికీ
అయిపోవద్దు దుర్యోధనులం ....
తన కోపమే తనకు శత్రువై
కోరికలన్నీ తీర్చుతుంది అనుభవాల
తోటలో చివరాఖరుకు ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment