Monday, May 20, 2024

చిత్ర కవిత తేది : 29-04-2023 శీర్షిక : తల్లి తపనల సాక్ష్యం

 చిత్ర కవిత 

తేది : 29-04-2023
శీర్షిక : తల్లి తపనల సాక్ష్యం  

పల్లె జీవితం కొట్టొచ్చింది 
తల్లి తపనలు సాక్ష్యమయ్యి ... 
సౌకర్యమేదయినా  సాధనలతో 
కడుపులు నింపే ఆరాటం ..... 

పొయ్యి కిందికున్నా లేకున్నా   
పొయ్యి మీదికున్నా లేకున్నా 
లెక్క తప్పని రెక్కల కష్టం 
ఏపూటకాపూటకు ఎదురు లేని ధైర్యం .....   

కూలి నాలికెళ్ళినా సరే 
రెక్కలు ముక్కలైనా సరే 
పుల్లా పుల్లా ఏరుకొచ్చి 
వంటచెరుకు తంటాలను 
అధిగమించే వారు ఒకప్పుడు .... 

అరకొర సౌకర్యాలైనా 
అరువు జీవితాల బతుకులైనా .... 
గుండె ధైర్యాన్ని మించింది లేదని 
నిండు ఉదాహరణలే  కళ్ళముందు  ..... 

వజ్రోత్సవ వాకిట నిలిచినా  
ఇంకా ... అక్కడక్కడా సాక్ష్యాలే 
ప్రశ్నించుకోవాలి పాలకులు .... 
స్వార్థాలు మాని... మానవత్వం 
విరబూయాలి ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment