Monday, May 20, 2024

చిత్ర కవిత తేది : 29-04-2023 శీర్షిక : ఆనందాల హరివిల్లు --భర్త పాపిట తీస్తున్న దృశ్యం )

 చిత్ర కవిత

తేది : 29-04-2023
శీర్షిక : ఆనందాల హరివిల్లు 

తిరిగి చూసినంతలోనే కనుమరుగాయే ....  
కష్టాల కడలిలో ఈదిన సాహసమంతా 
కరిగిపోయి కరిమింగిన వెలగపండయ్యింది .... 
ముదిమి మీదికొచ్చి మురిపిస్తున్నది .... 

వజ్రోత్సవాల వసంతమే 
వార్ధక్యంలో కూడా పరిమళిస్తూ 
విరిజల్లులు కురిపించుతూ  
చిరు దరహాసంగా  నిలిచింది ..... 

ఏడడుగులు నడిచిన రోజు 
మూడు ముళ్ళు వేసిన రోజు 
చేసిన ప్రమాణాలకు  సాక్షిగా 
చేయూతగా నిలిచినాడు .... 

ఆత్మీయతలకు అంకురమై 
అనురాగాలకు చిరునామై 
అన్యోన్యతలకు పుట్టినిల్లుగా 
అలరారుతున్నది హైందవాన .... 

కంటిచూపు కాసింత కసిరినా 
ఇంటిమహాలక్ష్మికి సిందూరమై 
జంట వీడని గువ్వల జంటగా 
వెంట నడిచే ఆనందాల హరివిల్లై .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment