పశువుల కొట్టం
తేది : 28-04-2023
శీర్షిక : ఎద్దులేనిదే ఎవుసం లేదు ....
నాగరికతలో నడకలు నేర్చి
పని నాణ్యతలో పశువుల సహకారం
మరువలేనిదని గుర్తించి హైందవాన
చేరదీసి చెంత నిలుపుకున్నాడు ....
ఉన్నవారు ఉన్నంతలో ....
గడ్డి గుడిసెలో ...గూన కప్పడమో
నిర్మించి ... ఎండా వానలకు
నీడగా ఉంచేవారు నాడు .....
గోవు కొలువైతే భావి జీవితం
బంగారుమయమంటూ ....
ఎద్దు లేని ఎవుసం లేదని అపురూపంగా
చూసుకుని ఆదరించేవారు....
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవల్లు...
కోరినంత పాడి నిండు కడవల్లు...
అంటూ పొంగి పొర్లిన కవిత్వాలు....
ఆంతర్యం గ్రహిస్తేనే మనుషులం ....
తన బిడ్డకు పాలు తగ్గించుకుని
మన కడుపులు నింపే పశుసంపదకు
ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము .....
ఎంత చేసినా వింతేమీ కాదు ....
గడ్డి మేసినా పశువు మనుషులకు
వింతగా మేలైన పాలు ఇస్తుంది ....
పాలు తాగి కూడా మనిషేందుకో ....
పశువు తినే గడ్డి పనులు చేస్తున్నాడు ....
గడ్డి పేరుతోనే దోచేస్తున్నాడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment