Monday, May 20, 2024

ఇంటి భోజనం - బయట తిండి శీర్షిక : ఆరోగ్యాల అనుబంధం- అనారోగ్యాల పెట్టుబడి-26-05-23

 ఇంటి భోజనం - బయట తిండి 

శీర్షిక : ఆరోగ్యాల అనుబంధం- అనారోగ్యాల పెట్టుబడి

అమ్మచేతనైన ఆలిచేతనైన..
కారపన్నమైన కమ్మగుండు…అమృతమై... 
ఆత్మీయతలు నిండుగా జోడించి
అనురాగములు రంగరించి ముద్ద 
తిన్న మనసుకు మురిపమైన బంధం... 

చేతనైనంతలో చేయి తిరిగినంతలో 
ఇంతుల చేతిలోన ఇగురించిన
ఇంటిభోజనమును మించి దొరుకునా 
శుచి శుభ్రతల సుందరముగాను 
కొసిరివడ్డింపులో కొరతలేని రుచులతోడ... 

నాగరికతల నడకలలో నలిగి 
సాంకేతికతకు చిక్కిన పరుగులలో 
బ్రతుకుజీవుడా అంటూ భారాలను 
దేవునిపై మోపి బావురుమంటున్నారు …

బయట తిండి అంటేనే బతుకు లేక 
బతకలేక ఈడ్చి గతుకుడని తెలుసు ... 
పెక్కు అనారోగ్యాల పెట్టుబడి చేస్తూ
పక్కవారి కొరకని పట్టింపు లేని పనులతో 
పాచిన పాత్రల అంటుసొంటులన్నీ 
పోలుబోసినట్టు దారిపట్టు రోజులకొద్దీ రోతగాను ...

కాచిన నూనెలు మళ్లీ మళ్లీ కాచి మాడబెట్ట …
పెనాలపైనా నల్లగా పేరుకున్నజిడ్డు..
కడాయిల  అంచులలోన కారిన అట్ట …
అనారోగ్యాలనేకరములని అనుభవజ్ఞుల మాట
పేగుపూతల రోగాలు పెరుగుచుండెనని 
శంఖమూది చెవినిల్లు గట్టుచుండె డాక్టర్లు శాస్త్రజ్ఞులు... 

విజ్ఞానం వివేచనం రంగరించి 
విషయానికి విరుద్ధమైనది కాకుండా 
ఆరోగ్యాన్ని అంటుకట్టి బ్రతికించే 
ఆలోచనలకు పట్టం కడదాం .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment