Monday, May 20, 2024

కవన రవళి నానీలు తేది. 27-04-23

 నానీలు 

తేది. 27-04-23

1. అప్పుడప్పుడు 
అదోలోకం… 
పరధ్యాన్నపు 
ఆలోచనలేమో… 

2. సృజన భజనలు 
భిన్న కోణాలైనా
భీష్మించుకోని
కవలలే….

3. చప్పట్ల దుప్పట్లు
కప్పితేనే… 
సృజనలకు 
శ్రీకారమౌతుంది…

4. మనుషులయినా 
మనీ అయినా 
చలామణిలోనే
శోభాయమానం. 

5. 
సద్ది మెతుకుల 
బువ్వ దొరకాలంటే 
బుద్ది చెదలుకు 
బూజు దులపాలి .... 

నగునూరి రాజన్న. 

No comments:

Post a Comment