కుక్కల బెడద
తేది : 04-04-2023
శీర్షిక : వింత ప్రవర్తన ....
విశ్వాసానికే వీర చిహ్నం
వీధి మొత్తానికే కాపలాగా
నిలిచి ... ధైర్య సాహసాలకు
పెట్టింది పేరై మనిషికి దాపు ....
నిశిరాత్రి ఒక్క కుక్క భౌ మంటే
ఎక్కడెక్కడో తచ్చాడేవన్నీ
తప్పకుండ గొంతులు కలిపి
దొంగో ... దొరో ... తేల్చేంత జ్ఞానం ....
ఇంటికైనా ... పంటకైనా ...
పశులమందలకైనా ....
అంటిపెట్టుకుని నమ్మకానికి
అమ్మలాగా ఉంటాయనుకుంటుంటే ...
ఉన్నట్టుండి... ప్రకృతి తిరగబడింది ....
కాలుష్యాల బెదడలో... కల్తీల లీలలో ....
తోడు నిలవాల్సిన గ్రామసింహాలు
తోడేళ్ళ వలె పీక్కుతింటున్నాయి ...
పరిహాసాలు మాని పాలకులు ...
విజ్ఞానం కోసం శాస్త్రజ్ఞులు
వింతప్రవర్తనల సంతను
కట్టడి చేసే కార్యక్రమం పెట్టుకోవాలి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment