Monday, May 20, 2024

ఆత్మ నిర్భరం తేది :27-04-2023 శీర్షిక : స్థితప్రజ్ఞత

 ఆత్మ నిర్భరం 

తేది :27-04-2023
శీర్షిక : స్థితప్రజ్ఞత 
సంఖ్య : సహస్రాధికం 

అప్పుడప్పుడు అదోలోకం .... 
పరధ్యాన్నపు పడగ నీడలు .... 
అందరిలో నిలబడిఉన్నా 
సుదూర తీరాల మనోగమనం .... 

పరిసరాలన్నీ పచ్చని తివాచీ 
పరుచుకున్నా ....శిశిరం ఆవహించి 
పండుటాకుల గలగలలతో 
ఎండవేడి సురుక్కుమంటుంది ..... 

ఆరా తీస్తే ఆశల హరివిల్లులో 
కొన్ని రంగులు మాయమై...సహజత్వం 
దూరమై  భ్రమల తీరంలోని కెరటం 
పదే పదే తచ్చాడుతూ పాకులాడుతుంది .... 

కాలమెప్పుడూ బలీయమే .... 
చీకటి వెలుగుల సత్యమే .... 
అనుభవాల ప్రోదితో ... స్థిత ప్రజ్ఞతల 
అభ్యాసములతో ఆత్మ నిర్భరతల 
పూర్ణత్వాలతో  సంతృప్తిని సంతరించుకో .... 

అప్పుడిక అన్నీ వసంతాలే 
బ్రతుకు గమనమంతా విరితోటలే .... 
బింకముల పంకములెన్ని ఎదురైనా 
శంకము లేని ప్రశాంతములే ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment