ఒక్క ప్రశంస చాలు
తేది :26-04-2023
శీర్షిక : మరో అడుగు ...
సంఖ్య : సహస్రాధికం
పొద్దస్తమానం పొర్లుకుంటూ నిండుమనసుతో
బండెడు చాకిరీనైనా ఒంటి చేత్తో చేస్తున్నపుడు ....
ఒక్కమాట చాలు ..నూతనోత్తేజము వంపుకుని
పునరంకితమవ్వడానికి ....చిరునవ్వులు చిందించడానికి ....
శిశిరంలో తలలు దులుపుకున్న
నిస్పృహల తరువు వనాలకు
చిరు జల్లుల వసంతంలా
ఒక్క చినుకైనా నిక్కచ్చిగ పొంగిపోవు ...
వత్సరమంతా కచ్చరపు ఎద్దులలా
వడి కలిగిన సవ్వడితో ... పాఠ్యఅంశాల
ప్రణాళికలతో ఎదురులేని పోరుకు తలపడే
అధ్యయనాసక్తులకు... అప్పుడప్పుడు పలకరించే
ఓటముల అంచులలో నించున్నప్పుడు
ఒక్కటంటే ఒక్కటే ఓదార్పు వెయ్యేనుగుల బలం ....
నిరాశల నీడలలో తచ్చాడుతున్నపుడు
నిండుగా భరోసాలనిచ్చే అండదండలు
ఒక్కటుంటే చాలదా ... మరో అడుగు
వేసి ముందుకు దూకేందుకు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment