Monday, May 20, 2024

నిప్పుల కొలిమి తేది : 26-05-23 శీర్షిక : సంఖ్య : సహస్రాధికం

 నిప్పుల కొలిమి 

తేది : 26-05-23
శీర్షిక : 
సంఖ్య : సహస్రాధికం 

శుకపికముల సుందరగమనం
శుభోదయముల ఆహ్వానం ..
విచ్చుకున్న బంగారువర్ణమే
బాలభానుని లేత కిరణములు...

అజరామరమైన ఆ భానుడు 
నిత్యాగ్నిహోత్రుడే... నిరంతరం 
మార్పులేని చేర్పుల ప్రచండమే
మండుతున్న  అగ్నిగోళమే నిత్యం ... 

గుజి గుచ్చిన పచ్చని వనాలతో ఫరిడవిల్లి 
కాలుష్యాల ఆనవాళ్ళంటే ఏంటో తెలియక 
నిష్కల్మష నీరాజనాలతో జీవరాశి వెన్నంటి 
తులతూగింది ప్రకృతి ఒకప్పుడు .... 

మరకత శోభలతో నిండిన మహీతలం 
మహిమాన్వితమే జీవరాశికి నిలయమై ... 
స్వార్ధపు మత్తులో మునిగిపోయాక 
పంచేంద్రియాలు మొరాయించిన మనిషి 
పంచభూతాలను చెరబడుతూ …

చక్కర వ్యాధిగ్రస్తుల ఆవురావురులా 
అక్కరకు మించిన అరణ్యాల నరికివేతలతో
ధాతృత్వం మాత్రమే తెలిసిన ధరణిమాత
ప్రకృతికి విలవిలలాడుతూ కంటతడే…. 

సౌకర్యాల చంటిబిడ్డలా ఆరోవేలు 
పట్టుకుని హత్తుకుంటున్న పాలిథీను 
అడుగడుగున పరుచుకుని 
పెనుభూతంలా వికటాట్టహాసం చేస్తుంటే ... 

పైన తరువుల మాయం.. లోన 
కరడుగట్టిన కరగని సాక్షీభూతం 
పాలిథీన్లతో.. సలసల కాగుతున్న 
అవనిమాత చల్లబడటం ఇక కలే ... 

తగ్గిపోతున్న వర్షపాతపు లెక్కలు 
తరుముకొస్తుంటే..అప్పుల ఉబికి 
కట్టే వడ్డీలా ..నిప్పుల కొలిమికి దక్కని 
నీటి సుఖం…ఎడారి గుర్తులే… 

చేష్టలుడిగి వింతలను వీక్షిస్తున్న 
ప్రభుతలైనా విజ్ఞులైన ప్రజలైనా 
ఇకనైనా మేల్కొన కపోతే  అధోగతే 
ముందుతరాలకు మన కానుక ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment