Monday, May 20, 2024

వచన పద్యం నాలుగు పాదాలు. 25-05-23

 వచన పద్యం నాలుగు పాదాలు.  

25-05-23

1. నాకయినా నీకయినా భారతమ్మే అమ్మ కదా 
నాకు నీకు వేరంటూ వేర్పాటెందుకు సోదరా 
మనము అనుకుని ముందుకు సాగితే విందే కదా 
ఈ కలలే నిజాలయితే చాలు కదా మిత్రమా!

2. ఊక దంపుడు విషయాలు నెత్తికెత్తుకోకు 
చౌకబారుతనమును ప్రదర్శించబోకు 
ఈకలన్నీ పీకి పందిరేస్తారు పొరంబోకని 
ఈ కలలే నిజాలయితే చాలు కదా మిత్రమా!

3. శుక పికముల భాషలు తెలియకున్న బాగుండు 
కైకమ్మ వరములని  నిర్బందించకపోతే  మంచిగుండు 
జానకమ్మ కష్టముల బారిన పడకుండు
ఈ కలలే నిజాలైతే చాలు కదా మిత్రమా ...! 

4. బాకాలు ఊదుకునే బ్రతకు వద్దు 
జాకాలువని నమ్ముతారు జనము
నీకాలు చేయి పని పడతారు చూడు
ఈ కలలే నిజాలైతే చాలు కదా మిత్రమా ...! 

No comments:

Post a Comment