సృజన భజన
తేది : 25-04-2023
శీర్షిక : కవలలే ....
సంఖ్య : సహస్రాధికం
విభిన్న కోణాల వింత కలయిక
ఒకటి తూరుపు సిందూరమైతే
మరొకటి పడమర సంధ్యారాగం
పోలిక లేని సాధనల వాయిద్యాలు …
అయినా.... కవలలలా కలిసి ఉంటాయి ....
మేధో మదనాల మది లోతులను
తడిమితే రూపు దిద్దుకునేదానికి ....
మది గదులు తెరిచి మురిపింతలన్నీ
కుమ్మరించడమే కుసుమ సంపదల్లా .....
ఉత్తర దక్షిణ ధ్రువాలలా
ఎదురుబొదురయినా సరే ....
ఉద్దీపనల సూదంటురాయోలె
అద్దుకుంటూనే ఉంటాయి ఒక్కటిగా ....
కళలేవయినా ... కలికితురాయె
కనులకు అందాలు కొన్నయితే
వీనుల విందులు మరికొన్ని ....
మొత్తానికి పులకింతల విందులే ....
చప్పట్ల దుప్పట్లు కప్పితేనే
మరిన్ని ... మరిన్ని ... నూతన
సృజనలకు మహారాజ మార్గముల
మందారాల సుందరములు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment