మండే వేసవి మజ్జిగ నీళ్లు
తేది : 26-04-2023
శీర్షిక : అమృత తుల్యం / అమృత బాండం
పత్రహరితానికి పట్టుకొమ్మ
జీవావరణానికి జవజీవం ....
సంజీవనియే సూర్యరశ్మి
అది లేకుంటే ఏది లేదు .... జగతిలో
బాలభానుడే చలికాలంలో
యవనుడై అడుగిడు ఎండాకాలంలో ....
ముదుసలియై ముగించు
వానాకాలమని ... పల్లెపట్టున
వల్లె వేయుదురు చెట్టు నీడన
పెద్దమనుషులు ....
ఎవరిమాట వినని సీతయ్యలా
చిటపటల చిందులేస్తూ
భగభగలు కురిపించి దండి వేడితో
తడినంతా పీల్చి పిప్పి చేయు...
మంచి రోజులిప్పుడే కనక ...
మనకందు ఆహ్వానాలు ....
తప్పక రమ్మంటూ ... ఒప్పుల కుప్పగా
పెళ్లి పేరంటాలు పెద్ద ఉత్సవాలకు .....
తస్మాత్ జాగ్రత్త! తనువు ఎండలలోనా ...
తడి ఆర్చి నిర్జలీకరణలు నిన్ను హైరానా పెట్టు
తోడునీడగా చేసుకో తోబుట్టు లాంటి
మజ్జిగ నీళ్లు ....
కనిపెట్టి కాచుకును నిన్ను కంటికి రెప్పలా ....
కాకమ్మ కథలని కొట్టిపారేయకు ....
అనుభవాల నుడివిన
అమృత భాండమది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment