వందనాలు వత్సరాది పండగకు
సంఖ్య : సహస్రాధికం
వందనాలు వందనాలు
వత్సరాది పండగకు
శిశిరంలో మోడువారి
వసంతంలో చిగురిస్తూ ...
మరకతమై శోభలతో
మహిమలందె అవనిమాతా ...
వసంతాల వాకిటిలో
చిగురేసిన కొమ్మలన్నీ
వర్ణములను పొదువుకుని
పూలజల్లు కురిపించె ...
వందనాలు వందనాలు
వత్సరాది పండగకు
గున్నమావి గుబురులలో
లేచివుళ్ళ మత్తులతో
మధుమాసపు మధురిమలే
కోయిలమ్మ కూతలతో ....
షడ్రుచుల నింపుకుని
పూసినది వసంతం ..
కాలగణన చైతన్యంతో
కదిలింది మానవాళి ....
వందనాలు వందనాలు
వత్సరాది పండగకు
కాలమే మహిమాన్వితమని
విజ్ఞానులు బోధించిరి ....
కర్తవ్యమే పూజనీయమని
అనుభవాలు జోడించిరి ....
జీవన గమనమిదేనని
గురువుగా తాబోధించగా
ఆధ్యాత్మికతలల్లుకుని
భవితవ్యం దిద్దుకొనిరి ....
వందనాలు వందనాలు
వత్సరాది పండగకు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment