పుస్తక నేస్తం
తేది : 25-04-2023
శీర్షిక :
అక్షరాల తోవకు లక్షణంగ తోడై నిలిచి
అక్షయమైన కాంతులు వెదజల్లు..
మస్తకం పొందికగా ఎదగాలంటే
కాముక మనమంతా చదవాల్సిందే ...
చతుర విపుల కాలంలోనే
చక్కంగ దోస్తీ కుదురుకునే..
దూరదర్శనులు దూరవాణులు
చరవాణులు తెరలవాణులు
లేనిరోజుల్లో అతి దగ్గర బంధువులు....
సాగరాన పరుగెత్తే మీనంలా
వినీలాకాశంలో ఎగిరెల్లే విహంగంలా
విలువలు వలువలు తొడుక్కున్న ప్రతిరూపంలా
సాన బెట్టుకోవడమే సమ్మతమౌ బుర్రకు ...
మల్లె తీగకు ఆసరయ్యే పందిరోలే
మనిషి ఎదుగుదలకు తోడు నీడగ నిలిచి ....
అందములు పంచ సుందరాల ఆభరణమై
ఆకలి తీర్చంగ ఐదేళ్ళను నోటికందిస్తుంది ....
శిలను శిల్పంగా మార్చే శిల్పిలా
కర్రను బొమ్మగా మలిచే వడ్రంగిలా
దూదిని దుపట్టగా నేసే నేతన్నగా
అజ్ఞానుల తీర్చిదిద్దే గురువుగ మారొచ్చు...
హృదయ కమలాలను విప్పార్పి
మనసు కుసుమాలను స్పర్శించి
గుండె గుసగుసలను నిక్షిప్త పరిచే
నిండైన మనసున్న మంచి నేస్తం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment