Monday, May 20, 2024

ఉనికికి నిజరూపం-వేలి ముద్రలు. 24-05-2023*

వేలి ముద్రలు.

 ఉనికికి నిజరూపం


అనుభవాల సంకలనం
మనిషి మనిషికి ప్రత్యేకం
మన ఉనికికి నిజరూపం 
కోటానుకోట్లలోన ప్రత్యేకం… 

ఉప్పొంగే సముద్ర కెరటాలుగానో 
ఉరకలేసే మణి చక్రాలుగానో 
ఉచితరీతిన ఉట్టిపడే సాదృశ్యం 
వేలు వేలుకి ప్రత్యేకమైన 
ఏకైక గుర్తింపు సాధనం… 

నిరక్షరాస్యతల నీడలలో 
గొడుగుపట్టి కాపాడింది 
ఇంటికి పైకప్పులా రక్షించి 
కంటికి రెప్పలా కాచుకుంది .... 

నిరక్షరాస్యులని నిర్లక్ష్యం వద్దు 
నీడలతోనే నిఖార్సైన కొలతలేసి 
ఉపగ్రహాలంత ఖచ్చితత్వంతో 
ఊసులన్నో ముల్లెగట్టిన ఉద్బోధనలు 
ఉపనిషత్తులు పురాణాలలో వేదాలలో 
ఉటంకింపులు హైందవమున… 

సాంకేతికతల నీడలలో సైతం 
శాశ్వతత్వం సంతరించుకుని 
ఇంద్రునికి వజ్రాయుధంలా  
ఇహలోకంలో గుర్తింపులెన్నింటిలోనో 
చిరాయువుల చిహ్నమైనది..

విశ్వంలో వేరెవరికీ దక్కని 
వింతలు నిండిన చరితం ... 
భారతజాతి ఛాతి విరుచుకుని 
విర్రవీగి ఆనందించగలిగే క్షణాలు ... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment