Monday, May 20, 2024

దీపం …ఒక ఏకాంతం తేది: 25-05-23 శీర్షిక : మణిదీపం

 దీపం …ఒక ఏకాంతం 

తేది: 25-05-23
శీర్షిక : మణిదీపం 
సంఖ్య : సహస్రాధికం 

చిమ్మ చీకట్లను పారద్రోలే దివిటీ
వెలుగులు ప్రసరించే వెల్లువల నది
మొక్కవోని దీక్షా దక్షతలకు సంకేతం 
తోడెవరున్నా లేకున్నా స్థిరచిత్త నివాసిని…. 

మానవాళి గుండెలు మల్లె పరిమళాలు
నిండిన మమతల ఆత్మీయత చెమ్మలు..
మనసుతో  స్పృ శియించి మందారాలు
పూయించి అనురాగాలనే నింపుదాం ... 
    
మణిదీపంలా వెలిగించి మనుషుల
లోగిళ్ళను  కదిలిద్దాం .... 
మనమంతా కలిసిమెలిసి సుగంధాల
మరువంలా  జీవిద్దాం .... 

అవినీతి బాటలను అంతం చేసుకుంటూ 
నీతి నిజాయితీలను  తైలాలుగా మార్చుకుందాం…
న్యాయసూత్రాలను వల్లె వేసుకుంటూ
ధర్మ పాదాలను పట్టుకుని పూజిద్దాం… 

కుళ్ళు ముళ్ల బాటలను కూలదోసుకుంటూనే 
కుసుమ పరిమళాలనే  వత్తులుగా కూర్చుకుందాం ...
తిలా పాపములన్నీ తలా ఇంతంటుంటే 
ప్రజా సంక్షేమాల పద్దులను పకడ్బందీగ వ్యయం చేద్దాం... 

అధర్మాల చీడలను అనితరంగ చెండాడి 
ధర్మపు   జ్యోతులను దరికి చేర్చుకుందాం  .... 
అసత్యాల నీడలను అంటుకోకుండానే 
సత్యపు కిరణాలను ప్రసరింప చేద్దాము ... 

ఆనందపు  దీపాలను ఆదరించి మనమంతా 
ఎప్పటికప్పుడు వినూతనలను
అక్కున చేర్చుకుని వింత వింతల
విజ్ఞానాలకు చిరునామాగా వెలిగి 
విశ్వవీథి గగనాన విజయగీతికలమౌదాం.   

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment