Monday, May 20, 2024

చిత్ర కవిత తేది: 22-05-2023 శీర్షిక : అనుభవాల నీడలు (నడచి వెళుతున్న వృద్ధ దంపతులు ) 

 చిత్ర కవిత 

తేది: 22-05-2023
శీర్షిక :  అనుభవాల నీడలు 
సంఖ్య : సహస్రాధికం 

తడారిపోతున్న నీడలలో 
తండ్లాడుతున్న వృద్ధాప్యం .... 
అమరమైన తమ ప్రేమలను 
మీ ఉన్నతికై ఖర్చుచేసిన వైనం .... 

సంపదల వేటలో మునిగిపోయి
తనువిచ్చిన అపూర్వ దైవాలకు  
పంపకాలు వేసుకుని  ఆర్థికత్వాన్ని 
మూట కడుతుంటే తట్టుకోలేక .... 

తరువైన తనువులు నిత్యం 
నీ అభివృద్ధి స్మరణం తోనే 
కాలం గడిపి.... నీవో తరువైతే 
ఆ నీడలో సేదదీరాలనుకున్న మానసం ....  

అడుగులో అడుగేసుకుంటూ 
అంతర్ధానం దిశవైపు సాగుతున్న  నడక .... 
ఆ తదుపరి నెత్తి నోరు మొత్తుకున్నా 
దర్శనమీయ లేని దైవత్వం .... 

మేలుకో మానవా ఇకనైనా 
కోలుకోగలవు ...లేదంటే  వారసత్వ 
బంధాలకు దూరమై...ప్రాయశ్చిత్తం లేని 
పాపకూపంలో కునారిల్లి పోగలవు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment